#htmlcaption1 #htmlcaption1 #htmlcaption1 #htmlcaption1 #htmlcaption1

marquee 1

** Do You Need Blood Donner,click on these links   friends2support.org ; bharatbloodbank.com ; bloodhelpers.com ; bloodbankindia.net ; bloodwala.com ; plateletdonors.org [FOR PLATELETS ALSO] ** Do You Need Blood Donner,click on these links

marquee 2

** LIC U LIP NAV's  Click here ** LIC's Mobile Apps for Android ,Windows and Desktop users Click here ** Online Pay LIC Premium instant payments Click here ** Online Pay LIC Premium Login Users Click here

Tuesday, July 29, 2014

శ్రీ  కనకధార  స్తొత్రమ్ (తెలుగు భాష్యం ) - Kanakadhara stortam (With Telugu Meaning)

లక్ష్మీక్షీర సముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం

దాసీభుత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం

శ్రీ మన్మంద కటాక్ష లబ్దవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం

త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం....


                            




లక్ష్మీక్షీర సముద్ర రాజతనయాం శ్రీ రంగ ధామేశ్వరీం
దాసీభుత సమస్తదేవ వనితాం లోకైక దీపాంకురాం
శ్రీ మన్మంద కటాక్ష లబ్దవిభవద్బ్రహ్మేంద్ర గంగాధరాం
త్వాం త్రైలోక్య కుటుంబినీం సరసిజాం వందే ముకుంద ప్రియాం

కమలాలను రెండు చేతులతో ధరించి, అభయ వరద హస్త ముద్రలను ప్రదర్సిస్తు , గజరాజు సేవిస్తు ఉండగా, శ్రీమన్మహాలక్ష్మి దర్శనమిస్తుంది. ఐశ్వర్య ప్రదాయిని, అష్టలక్ష్ముల సమ్ష్టి రూపమే మహాలక్ష్మి దేవి!
ఈమే క్షీరబ్ది పుత్రిక. డోలారుడు అనే రాక్షసుడిని సమ్హరించిన దేవత. శక్తి త్రయం లో ఈమే మధ్య శక్తి. ఈ దేవిని ఉపాశన చేస్తే ఫలితాలు సీగ్రముగా కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి.
శర్వజగత్తులకి కారణమైన పరాశక్తే లక్ష్మీ దేవి. ఈ జగత్తు అంతా ఏ శక్తి చేత రక్షింపబడుతున్నదో , ఆ శక్తే "లక్ష్మీ"!!!!!!!
లక్ష్యతే మీయతే అనయా ఇతి లక్ష్మి అని అనారు," లక్ష్మణాత్ లక్ష్మి"! ఈ జగత్తులో ప్రతిదానికి ఒక లక్షణం ఉంది. ఆ లక్షణాన్ని అనుసరించే సర్వవిధ ప్రవర్తనలు సంభవమవుతాయి. అలా జగత్తుకి హేతభూతమైన లక్ష్మణ శక్తి లక్ష్మీ.
భగవద్గీత లో కృష్ణ పరమాత్మ ' ఇవి నా విభుతులూ అని విభుతి యోగం లో చెప్పినవన్ని లక్ష్మీ స్వరూపాలే!
ఎవరైనా సరే ముందుగా లక్ష్మీ కటాక్షాన్నే కోరుకుంటారు. అయితే తన బిడ్డల సంగతి తెల్సు కనుక , విద్యాగంధం లేని వాడు అఙ్ఞవశాన ధనాన్ని చెడుపనులకు ఉపయోగించి, పాపాలను మూటకట్టుకుంటాడు అనే ఉద్దేశంతో మొదట అతనికి సరస్వతి ప్రసన్నతను అనుగ్రహించి, ఆ తరువాత ఐష్వర్యాన్ని చక్కగా అనుభవించగలిగే వివేకాన్ని ఇస్తుంది. అందుకే ఆ తల్లిని ఐశ్వర్య ప్రదాయిని అని అన్నారు!
సూర్య, చంద్ర , అగ్ని, వాయువు, భూమి మొదలు అయినవి అన్నీ ఐశ్వర్యాలే ! వీటికి కారణమైన పర బ్రహ్మ శక్తి , ఐశ్వర్య రూపిణి లక్ష్మి దేవి!
త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిః పితా
త్వయైత ద్విష్ణునా చాంబ జగద్వ్యాప్తం చరాచరం
ఓ లక్ష్మి! ఆన్ని లోకాలకు తల్లివి నీవు. దేవదేవుడు అయిన విష్ణువే తండ్రి. నీ చేత, విష్ణువు చేత ఈ జగత్తు అంతా వ్యాపించబడింది అని ఇండ్రుడు లక్ష్మి దేవిని స్తుథించాడు. అందుకే జగదంబతత్వాన్ని గ్రహించి, హృదయం నిండుగా భావన చేస్తే, అమంగళాలకు చోతు ఉందదు! డబ్బుకు లోటు ఉండదు. చిత్తం సుద్ధమవుతుంది. సమస్త దరిద్రాలు ధ్వంసమవుతాయి...
'శ్' అంటే పరాశక్తి.....' ఈ' అంటే పరమేశ్వరుడు, 'ఋ అంటే అగ్ని బీజం. అగ్ని ఐష్వర్యకారకుడు. పరమేశ్వర సహితమూయిన,ఐశ్వర్య ప్రదాయిని లక్ష్మి అని "శ్రీ" కి నిర్వచనం .అందుకే ఆ తల్లి తత్వాన్ని గ్రహించి అందుకె తగినట్లుగా మసులుకుంటే, ఏ సమస్యలు దరికి రావు.
శుభ్రమైన ఇంట్లో, పంటపొలాల్లో, గోపురాళ్లో, తామరపువ్వుల్లో, రత్నాలలో, అద్దం మొదలైనవాటిల్లె లక్ష్మి కొలవు అయ్యి ఉంటుంది.
ఆవనెయ్య తో గాని, సువర్ణ జలం తో కాని లక్ష్మి దేవికి అభిషేకం చేస్తే ఐశ్వర్యప్రాప్తి కలుగుతుంది!
యా దేవి సర్వ భూతేషి లక్ష్మి రూపేణ సంస్తిథ అంటే అన్నీ జీవులలోను ఉండే లక్ష్మి స్వరూపము దుర్గా దేవి అని చండిసప్త సతి చెప్తోంది!
శ్రీ లక్ష్మిదేవ్యై నమో నమః!